అనుమానాస్పద మృతి పై అనేక అనుమానాలు...!!!

అనుమానాస్పద మృతి పై అనేక అనుమానాలు...!!! 

 కట్టుకున్నొడు బలి తీసుకున్నాడా...??
 
కరోనా బలి తీసుకుందా....?? 

కొండపల్లి న్యూ బీకాలని లో డాక్టర్ ఎన్ టి టి పీస్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అనుమానాస్పద మృతి...!! 

 కట్టుకున్న భర్త కడతేర్చాడంటూ మృతురాలి బంధువుల ఆరోపణ....!!! 

కరోనా సాకు తో భార్తే మర్డర్ ప్లాన్ చేశాడా అన్న కోణం లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.....!!!

 TV77తెలుగు కొండపల్లి: 
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మహిళా మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. కట్టుకున్న భర్త తమ కూతురుని కడతెర్చాడు అని మృతురాలు బందువులు సంచలన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మహిళా మృతి చర్చనీయాంశం అయ్యింది.డాక్టర్ ఎన్ టీటీ పీస్ లో ఫైర్ విభాగం లో పని చేస్తున్న కొండపల్లి కి చెందిన వ్యక్తి తో వీరులపాడు గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయ్యింది.వీరికి 8 ఏళ్ల ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు.. చనిపోయిన మహిళ సైతం డాక్టర్ ఎన్ టీటీ పీస్ బోర్డ్ ఆసుపత్రి లో కాంట్రాక్ట్ బెస్ మీద స్టాఫ్ నర్స్ గా పని చేస్తోదని సమాచారం.అయితే ఇటీవల ఆ కుటుంబం కరోనా బారిన పడింది.మొదట వ్యక్తి తండ్రి కరోనా బారిన పడి ఆసుపత్రి లో చికిత్స తీసుకోని గత రెండు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పడు మహిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.ఆమె మృతి పట్ల మహిళా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ భర్తే తమ కూతురిని హతామార్చాడని ఆరోపిస్తున్నారు.భర్త అక్రమ అక్రమ సంభందానికి అడ్డుగా ఉందని తమ కూతురిని హత్య చేశాడని ఆందోళనకు దిగారు.ఇదే విషయం పై పోలీసులు మాట్లాడుతూ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించామని.పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.అయితే ప్రాధమిక విచారణ లో భాగంగా మహిళా మృత దేహం పై ఎలాంటి గాయాలు లేవని. మహిళకు కరోనా సొకగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది.కరోనా కారణంగా ఒక్క సారిగా కుప్పకూలిపోయి చనిపోయే అవకాశం లేదని ఇది కచ్చితంగా హత్యే అని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. జరిగింది హత్యా, లేక ఆత్మహత్యా.. అవేమీ కాకుండా కరోనా తో చనిపోయిందా అనేది తేలాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేయాల్సి ఉంది. పోలీసుల పోస్ట్ మార్టం అనంతరం మహిళా మృతి పట్ల అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. 

 సత్య... 
రిపోర్టర్, మైలవరం