భారీ మొత్తంలో గంజాయి

TV77తెలుగు విశాఖపట్నం: పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. పాడేరు మండలం చింతలవీధి వద్ద భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ వ్యాన్‌లో తరలిస్తున్న 2,520 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పోలీసులను చూసి రోడ్డు ప్రక్కన వ్యాన్‌ను అపి దుండగులు వెళ్లిపోయారు. నిందితులను పట్టుకవడానికి పోలీసుల ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.