293/1 నుండి 6 వరకు (అర్ ఎస్ ఆర్ ) రికార్డులో ఉన్న భూమి గ్రామ కంఠం గా చూపిస్తున వైనం...!!
గ్రామ కంఠం గా ఉన్న భూమిలో నిర్మాణ పనులు అడ్డుకోవడం తో అవస్థలు పడుతున్న స్థానికులు....!!!
ప్రజా సమస్యగా మారిన ఈ భూ వివాదం లో అధికారుల తాత్సారం ఎందుకో అంతు చిక్కని ప్రశ్న...!!!
ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపుగా కుంగి పోయిన సమీప నిరుపేదల కట్టడాలు ఇక గులాబ్ తుఫాన్
నేపథ్యంలో ఎప్పుడు ఏ అనర్థం జరుగుతుందో అన్న భయాందోళన....!!!
TV77తెలుగు కొండపల్లి:
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో లోని బ్యాంక్ సెంటర్ ప్రాంతంలో నెలకొన్న భూ వివాదం లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 293/ 1 సర్వే నెంబర్ మొదలుకొని 293/6 సర్వే నెంబర్ వరకు విస్తరించి ఉన్న మొత్తం భూమి రెవెన్యూ ఆర్ ఎస్ ఆర్ రికార్డులో గ్రామ కంఠం గా చూపించడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.. ఇటీవల ఉన్నత న్యాయ స్థానం హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వివాదం సంభందించి ఆ సర్వే నెంబర్ లో ఉన్న భూమి వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు. భూ వివాదం కారణంగా చుట్టు ప్రక్కల కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపథ్యం ఈ భూ వివాదంలో అధికారులు తాత్సారం చేయడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అధికారులు సర్వే చేస్తున్న సమయం అక్కడికి వచ్చిన వక్ఫ్ బోర్డ్ అధికారులను స్థానికులు నిలదీసిన పరిస్థితి. వివాదం లో ఉన్న భూమి వక్ఫ్ బోర్డు స్థలమా లేక గ్రామ కంఠం మా అనే విషయం పై వివాదం నడుస్తోంది.. ఈ క్రమంలో అధికారుల సర్వే నిర్వహణలో భాగంగా భూ వివాదం కారణంగా ఇబ్బందులు పడుతున్న స్థానికులు ఒక్క సారిగా ఆందోళనకు దిగారు. వివాదం ఉన్న భూమి అసలు ఏ శాఖ భూమి అనేది సరైన వివరణ ఇవ్వడానికి ఇంత సమయం తీసుకుంటారా అంటూ అధికారులను నిలదీశారు. కొండపల్లి కేంద్రంగా జరుగుతున్న ఈ భూ వివాదం చూస్తే ఇది మీదా మాదా అన్నట్లు లేదని ఇది నీదా నాదా అన్నట్లు వివాదం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.10 కి పైగా కుటుంబాలు ఈ వివాదం కారణంగా దిన దిన గండంగా బ్రతుకుతుంటే అధికారులు మాత్రం వేడుక చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సగం కుంగిపోయమని. గులాబ్ తుఫాను దెబ్బకు సర్వం పోగొట్టుకొని రోడ్డున పడాల్సిందే అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రజా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సత్య....రిపోర్టర్
మైలవరం