సహాయక చర్యలను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే రాజా

సహాయక చర్యలను వేగవంతం చేయాలి 

 వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన శాసన సభ్యులు జక్కంపూడి రాజా

 TV77తెలుగు కోరుకొండ:
 కోరుకొండ మండలం శ్రీరంగపట్నం బురద కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపడుతున్నామని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.గురువారం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ పరిధిలోని ముంపునకు గురైన ఎస్టీ కాలనీ, ఎస్సి కాలనీ,ఓ.సి కాలనీలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబ్ తుఫాన్ వలన ముంపునకు గురైన పంట పొలాల రైతులందరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని,రైతులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.వరదల సమయంలో బురద కాలువ పోటెత్తడంతో వరద నీటిలో మునిగి పోయిన వరి పంటలను వ్యవసాయ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.అధికారులందరూ ముంపుకు గురైన పంట వివరాలు సేకరించి ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వివరాలను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.గత మూడు రోజుల నుంచి వై.యస్.ఆర్.సి.పి పి.ఏ.సి సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి మరియు కోరుకొండ ముఖ్య నాయకులు నిరంతరం ప్రజా పర్యవేక్షణలో ఉంటూ ముంపు నివారణ చర్యలు చేపడుతూ బాధితులను అన్ని విధాలుగా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.ఇలాంటి కష్ట సమయంలో ప్రతిపక్షాల వారు విమర్శలు మానుకోవాలని చేతనైతే బాధితులకు సహాయ సహకారాలు అందించాలన్నారు.గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి ధోరణి వల్లనే ఇంకా బురద కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం మార్గం లభించేలేదన్నారు.లోతట్టు ప్రాంతాల్లో శిథిలావస్థ భవనాలు, కూలిపోయే దశలో ఉన్న నిర్మాణాల్లో ప్రజలు ఎవరూ లేకుండా ఖాళీ చేయించాలని ఆయన అధికారులకు సూచించారు. దీర్ఘకాలికంగా ఉన్న బురద కాలువ సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతోనే గతంలోనే ఇరిగేషన్ అధికారులు ద్వారా సమగ్ర నివేదిక తయారు చేసి అధికారులకు పంపించడం జరిగిందన్నారు.వీలైనంత తొందరలోనే ఈ సమస్యకు పూర్తి శాశ్వత పరిష్కారం చేపడతామన్నారు.వరదలు వలన పడిన గండ్లను సత్వరమే పూడ్చే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు.అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువలన చుట్టుపక్కల గ్రామపంచాయతీల శానిటేషన్ సిబ్బందిని రప్పించి అవసరమైన పారిశుద్ధ్య పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ముంపు ప్రభావిత ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు అధికారులంతా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండాలని, వరదలపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు.అనంతరం ముంపు బాధితులకు జక్కంపూడి రాజా చేతులమీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పాపారావు, ఎం.డి.ఓ నరేష్ కుమార్, అగ్రికల్చర్ ఎ.డి మల్లికార్జున రావు, అగ్రికల్చర్ ఆఫీసర్ గౌరీ, ఇరిగేషన్ డి.ఇ ఆనంద్ బాబు, ఇరిగేషన్ ఏ.ఈ శివ ప్రసాద్, వైయస్సార్ సిపి నాయకులు ఉల్లి బుజ్జి బాబు, నక్క రాంబాబు, మద్దాల రమణ, సూరిశెట్టి సుబ్బలక్ష్మి భద్రం తదితరులు పాల్గొన్నారు.