రెండు కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్న జగ్గంపేట పోలీసులు
iraila 11, 2021
TV77తెలుగు జగంపేట:
తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం రామవరం 16వ నెంబరు జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబుకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట మండలం రామవరం శివారు రాజస్థాన్ దాబా వద్ద ఆగి ఉన్న లారీని తనిఖీ చేసిన పోలీసులు.లారీలో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల విలువైన 2000 కేజిల గంజాయిని పట్టుకున్న పోలీసులు.నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.2 లక్షల 29 వేల నగదు,7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పెద్దాపురం డిఎస్పి అరిటాకులు శ్రీనివాస్ మాట్లాడుతూ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు జగ్గంపేట కిర్లంపూడి ఎస్ఐలు కృషితో ఒక మంచి ఆపరేషన్ చేయడం జరిగింది మీ విలేకర్ల సోదరులు వలె మాట్లాడి ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా రామవరం రాజస్థాన్ వద్ద మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎస్పీ గారు గైడెన్స్ తో పట్టుకోవడం జరిగింది. ఒక లారీలో రెండు టన్నుల 68 కేజీలు గంజాయి మరియు నలుగురు మనుషుల్ని పట్టుకోవడం జరిగింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన రజిత్ బాగ్, కిలో ప్రసాద్, దార కృష్ణ, సింహాద్రి,ఈ లారీ తో పాటు రెండు వెహికల్స్ ,బొలెరో, టొయోటా కారు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద లభించిన 2 లక్ష 31 వేల రూపాయలు అలాగే వారి ఒంటి మీద ఉన్న బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. కోర్టులో అప్పగించటం జరుగుతుంది. చట్టం చాలా పెద్దది గంజాయ్ వ్యాపారం చేసే వారు ఎక్కడో ఒక చోట దొరుకుతారు. . గంజాయి ఉత్తరప్రదేశ్ కు రవాణా అవుతుంది. ఇందులో మరో ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు ఒక డ్రైవరు ఒకరు ఓనరు వారిద్దరిని తొందర్లోనే పట్టుకుంటాం . మంచి క్యాచ్ చేసిన సిఐ గారికి జగ్గంపేట కిర్లంపూడి ఎస్సీలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. విశాఖ దట్టమైన అడవులలో ఏ ఓ బి ప్రాంతంలో గంజాయ్ పండిస్తున్నారు. చింతపల్లి దగ్గర ఒరిస్సా దగ్గర ఉన్న బ్రోకర్లు కొని రవాణా చేస్తున్నారు ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు వారిపై ప్రత్యేక దృష్టి సారి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, జగ్గంపేట ఎస్ ఐ లక్ష్మీకాంతం, కిర్లంపూడి ఎస్సై అప్పలరాజు,జగ్గంపేట కిర్లంపూడి పోలీస్స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.