మంద కృష్ణ మాదిగ ను కలసిన తూర్పుగోదావరి జిల్లా మాదిగ జర్నలిస్టులు

TV77తెలుగు సికింద్రాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ న్. వ్యవస్దాపక అద్యక్షుడు మాన్య కృష్ణ మాదిగ ను తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం మాదిగ విలేకరులు బుధవారం ఆయనను కలిశారు.ఇటీవల ఢిల్లీ పర్యటన లో వర్గీకరణ సాధన లో భాగంగా ప్రమాదవశాత్తు కాలుజారీ పడి ఆపరేషన్ జరిగిన కారణంగా అనారోగ్యంతో ఉన్న ఆయనను సికింద్రాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా లో మాదిగ జర్నలిస్టుల ఫెడరేషన్ భలోపేతనం చెయ్యాలని ఆయన మాకు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.కృష్ణ మాదిగ ను కలసిన వారిలో పెన్ పవర్ క్రైమ్ బ్యూరో మారంపూడి సోమరాజు ,ఆర్.టి.ఐ మీడియా ఇన్ చార్జ్ కావూరి వరలక్ష్మి , పెన్ పవర్ రిపోర్టర్ కుడెల్లి రత్నకిషోర్, ఇండస్ విజన్ రిపోర్టర్ కొల్లి పోసియ్య తదితరులు పాల్గొన్నారు.