ప్రపంచ శాంతి కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి కొరియా దేశ శాంతి రాయబారి జోషియా యాంగ్

TV77తెలుగు చెన్నై: ప్రపంచ శాంతి కోసం ప్రతిఒక్కరు కృషి చెయ్యాల్సిన సమయం అసన్నమైనదని కొరియా దేశానికి చెందిన శాంతి రాయబారి జోషియా యాంగ్ అన్నారు. చెన్నైలోని ఆంధ్రా క్లబ్ లో మంగళవారం ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని లెగసీ ఆఫ్ గ్లోబల్ పీస్ అవార్డు-2021 ప్రధానోత్సవం ఏర్పాటయ్యింది. ముఖ్య అతిధులు గా విచ్చేసిన కొరియా దేశానికి చెందిన శాంతి రాయబారులు జోషియా యాంగ్, జాన్, జపాన్ దేశానికి చెందిన శాంతి రాయబారి లినా మాట్లాడుతూ ప్రజలు శాంతి యుతంగా జీవించినప్పుడే దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతుందన్నారు. శాంతి లేనిచోట మానవాళి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ అధ్యక్షత వహించిన సభలో ప్రశాంత్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సి.గీతా హరిప్రియ జ్యోతి ప్రజ్వళనతో సభను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, మహారాష్ట్ర కు చెందిన వివిధ రంగాలలో ప్రతిభావంతులైన 26మందికి ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.అద్దంకి రాజా ఆధ్వర్యంలో జ్ఞాపిక, మెడల్, ప్రశంసాపత్రానిచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్.ఎం. ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ వి.కతిర్వెల్, ఓం శ్రీ సెక్యూరిటీ సర్వీసెస్ ఎం.డి డాక్టర్ ఎస్కే. ఎం. వలీ, తెలుగు భాషాభివృద్ధి సమితి అధ్యక్షుడు డాక్టర్ గూటం స్వామి, ఆంధ్రప్రదేశ్ పీస్ ప్లాంటర్స్ రీజినల్ డైరెక్టర్ ఏ. జాయ్ కుమార్, లయన్ పోకూరి సత్యనారాయణ, డాక్టర్ జల్లి విక్టర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.