నేడు బంగారం ధరలు తగ్గాయి
iraila 01, 2021
TV77తెలుగు హైదరాబాద్
దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి.బంగారం ధరల్లో ఈరోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.44,300కి చేరింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి రూ.48,330కి చేరింది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు కొంతమేర తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ఇక బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి.కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ. 63,500 వద్ద కొనసాగుతోంది.