పేకాట శిబిరంపై పోలీసులు దాడి 6 గురు అరెస్ట్,రూ.35,650 క్యాష్,6 సెల్ ఫోన్స్ సీజ్

TV77తెలుగు జగ్గంపేట: జగ్గంపేట-గోకవరం రోడ్డు లోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న టౌన్ హాల్ నందు రహస్యంగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబు తెలిపారు, జగ్గంపేట ఎస్ఐ యస్ లక్ష్మి లకు వచ్చిన సమాచారం మేరకు ఏస్ ఐ జగ్గంపేట తన సిబ్బందితో సోమవారం పేకాట శిబిరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో టౌన్ హాల్ లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 35 వేల 650 రూపాయల నగదును, 6 సెల్ ఫోను లను స్వాధీనం చేసుకున్నట్లు SI జగ్గంపేట తెలిపారు. వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.