47 లక్షల విలువ గల కోవిద్ కిట్లు స్వాధీనం

TV77తెలుగు కర్నూలు: పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న కొవిడ్ పరీక్ష కిట్లను సెబ్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు AP 29 BU 5908 ఇటియస్ కారు లో అక్రమంగా తరలిస్తున్న కొవిద్ 19 కిట్లు రాయలసీమ లోని జిల్లాలకు సరఫరా చేసేందుకు హైదరాబాద్ కు చెందిన కిశోర్ తీసుకుని పోతుండగా పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు పట్టుకున్నారు. కొవిడ్ కిట్లకు సంబందించిన బిల్లులు లేకపోవడంతో ఔషధ నియంత్రణ అధికారులకు సమాచారం ఇచ్చారు. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కేసు నమెదు చేసుకుని కిట్లను స్వాదీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న కిట్ల విలువ 47 లక్షల రుపాయలు ఉంటుందని డ్రగ్స్ కంట్రోల్ అధికారి చంద్రశేఖర్ రావు తెలిపారు.