13 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి కళ్లు పొడిచేసి కిరాతకంగా
iraila 13, 2021
TV77తెలుగు మియాపూర్:
అదృశ్యమైన బాలిక(13 నెలలు) విగతజీవిగా కనిపించింది.ఇంటి సమీపంలోని నీటి గుంటలో చిన్నారిని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మియాపూర్‌లోని ఓంకార్ నగర్‌లో నివాసముండే దంపతులకు ఓ పాప ఉంది.చెత్త ఏరుకుని జీవించే ఆ దంపతులు ఆదివారం ఉదయం బయటికి వెళ్తూ చిన్నారికి పక్కింట్లో వదిలారు.సాయంత్రం వచ్చేసరికి పాప కనిపించకపోవడంతో పక్కింటివారిని అడగ్గా తమకు తెలియదని చెప్పారు.స్థానికుల సాయంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్థానికంగా ఉండే 13ఏళ్ల బాలుడు పాపను ఎత్తికెళ్లి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.పాప అదృశ్యమైనప్పటి నుంచి బాలుడు కూడా కనిపించకపోవడంతో అందరికీ అతడిపైనే అనుమానం కలిగింది.ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న నీటిగుంటలో బాలిక శవమై కనిపించింది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాప కళ్లు పొడిచేసి ఉండటంతో ఎవరో ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక సరైన కోణంలో దర్యాప్తు చేపట్టి నిజాలు నిగ్గు తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు.మరోవైపు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల్లో స్పష్టత లేకపోవడంతో వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నారు.