వంతాడపల్లి చెక్ పోస్ట్ వద్ద 120 కేజీల గంజాయి

TV77తెలుగు పాడేరు:
 విశాఖపట్నం జిల్లా, పాడేరు మండలంలోని వంతాడపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీలలో 120 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్నోవా కారులో కేరళ రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేరళకు చెందిన హరీష్ కుమార్, రాజీవ్, అభిలాష్, సహనంద్, షైజుఖాన్ అనే ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.