చిన్నారులకు పిసివీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా... రాజమహేంద్రవరం, చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంపుదల చేసేందుకు అవసరమైన పిసివీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ ఛీప్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ ప్రారంభించారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు పిసివీ వ్యాక్సినేషన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా నిర్వహించారు.అనంతరం రాజన్న రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన వినతి పత్రాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు.ఈ సందర్భంగా పిసివీ వ్యాక్సినేషన్‌ను చిన్నారులకు వేయడం వల్ల కలిగే ఉపయోగాలను డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ కోమల ఎంపీకి వివరించారు. పిసివీ వ్యాక్సిన్‌ వల్ల కలిగే ప్రయోనాలను పూర్తి స్థాయిలో ప్రజలకు ముఖ్యంగా చిన్నారుల తల్లులకు కల్పించాలని అన్నారు.కోవిడ్‌ వైరస్‌ను సైతం ఎదుర్కొనే అవకాశం ఉన్న ఈ వ్యాక్సినేషన్‌ను గ్రామ పంచాయితీల్లో చిన్నారులను గుర్తించి ప్రతీ ఒక్కరికీ పిసివీ వ్యాక్సినేషన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గతంలో డబ్బులు ఉన్న వారు మాత్రమే ఈ వ్యాక్సిన్‌ను వేసుకునే వారని.అదైనా ప్రైవేటు ఆసుపత్రిల్లో మాత్రమే లభించేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ బుధవారం, శనివారాల్లో ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి ఉచితంగా తీసుకొచ్చిందని, ఈ వ్యాక్సినేషన్‌ వేయించడం వల్ల కోవిడ్‌ నుంచి కూడా చిన్నారులను రక్షించుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు.కావున తప్పనిసరిగా చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ వేయించుకునేలా దృష్టి సారించాలని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో ముందుచూపుతో కరోన మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఈ ఏర్పాట్లు చేశారని అన్నారు.కావున పిల్లల తల్లులు తప్పనిసరిగా తమ తమ బిడ్డలకు ఈ వ్యాక్సిన్‌ను వేయించేలా దృష్టి పెట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ కోమల మాట్లాడుతూ 3,500 రూపాయల విలువ చేసే ఇంజక్షన్‌ చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ఎంతో మేలు చేస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఇంజక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఒక నెలరోజున్నర రోజుల లోపు చిన్నారులకు ఈ ఇంజక్షన్‌ వేయడం జరుగుతుందని, ఈ ఇంజక్షన్‌ చేయడం వల్ల సాధారణ స్థాయిలో జ్వరం వచ్చే అవకాశం ఉందని, అయితే పారాసిట్‌మల్‌ సిరప్‌ను ఇస్తే సరిపోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌ఒ డాక్టర్ వినూత్న, ఐసిడిఎస్ అధికారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కానుబోయిన సాగర్‌, మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు రావిపాటి రామచంద్రరావు, గిరిజాల బాబు, వైయస్ఆర్సిపి సీనియర్ నాయకులు బిల్డర్ చిన్న, దుంగ సురేష్, రేలంగి వెంకటేశ్వరరావు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా రాజన్న రచ్చబండ కార్యక్రమంలో వివిధ అ సమస్యలపై వచ్చిన వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యలను అక్కడికక్కడే ఎంపీ భరత్ రామ్ పరిష్కరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు సమస్యలు, కుటుంబ తగాదాలు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో, సచివాలయ ఉద్యోగుల తో మాట్లాడి పరిష్కరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది క్రీడాకారులను నమ్మించి వారి నుంచి 10 లక్షలు చేసిన ఫిర్యాదుపై గతంలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను ఎంపీ భరత్ రామ్ పరిష్కరించడం జరిగింది.గతంలో అందుకు సంబంధించిన నగదు 8 లక్షల చెక్కును తిరిగి బాధితులకు ఇప్పించడం జరిగింది. ఆ మొత్తం తాలూకు చెక్కును ఎంపీ రచ్చబండ కార్యక్రమంలో బాధితులకు అందజేశారు.