విరాట్ కోహ్లీ వికెట్ కోసం సింపుల్ ప్లాన్
abuztua 28, 2021
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ ఎట్టకేలకి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. లీడ్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ (55: 125 బంతుల్లో 8x4).మంచి టచ్‌లో కనిపించినా కీలక సమయంలో మళ్లీ ఇంగ్లాండ్ బౌలర్ల ట్రాప్‌లో పడి పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు.ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతుల్ని వెంటాడి వికెట్ చేజార్చుకోవడం ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీకి పరిపాటిగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో గెలుపొందింది. లీడ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీని జేమ్స్ అండర్సన్ ఔట్ చేయగా.రెండో ఇన్నింగ్స్‌లో ఓలీ రాబిన్సన్‌కి కోహ్లీ తన వికెట్‌ని సమర్పించుకున్నాడు.ఇద్దరూ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతుల్ని సంధించగా.కోహ్లీ వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టిన ఓలీ రాబిన్సన్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.కోహ్లీ వికెట్ గురించి మ్యాచ్ తర్వాత రాబిన్సన్ మాట్లాడాడు.‘నేను వేసిన ఓవర్‌లో విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టాడు.కానీ.ఎట్టకేలకి అతని వికెట్‌ని పడగొట్టగలిగాను. కోహ్లీ ఔట్ కోసం ప్లాన్ చాలా సింపుల్.ఎలా అంటే. నాలుగు, ఐదో స్టంప్ లైన్‌పై బంతుల్ని వేస్తూ అతను తన శరీరానికి దూరంగా షాట్ ఆడేలా చూడటం.ఆ బంతుల్ని కచ్చితంగా అతను వెంటాడుతాడని మేము ఊహించాం. అదే జరిగింది’అని రాబిన్సన్ చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లీ ఈ బలహీనతని అధిగమించడం కోసం దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే....