కళ్యాణం జరిగిన మూడురోజులకే ప్రెగ్నెంట్

వివాహ బంధాన్ని కాలరాస్తూ ఓ మహిళ ప్రియుడితో అఫైర్ కొనసాగిస్తూనే మరో ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఘటన విశాఖ నగరంలో వెలుగుచూసింది. భార్య తనను మోసం చేసి రూ.లక్షలు దోచుకుని పరారైందంటూ ఆర్మీ జవాన్ ఇచ్చిన ఫిర్యాదుతో గాజువాక పోలీసులు దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.చినగంట్యాడకు చెందిన యువతికి గత ఏడాది డిసెంబరులో ఆర్మీ జవాన్‌ ప్రసాద్‌‌తో వివాహం జరిగింది. అనంతరం ప్రసాద్ తన భార్యను లక్నో తీసుకెళ్లాడు. అక్కడే భర్తతో బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనిపించుకున్న యువతి పలు దఫాలుగా రూ.లక్షల వరకు నగదు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా గాజువాక వచ్చేసింది. కొద్దిరోజుల తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తప్పించుకుని తిరుగుతుండటంతో ప్రసాద్ ఆరాతీయగా ఆమెకు అగనంపూడి, గాజువాకకు చెందిన ఇద్దరు యువకులతో పెళ్లిళ్లు అయినట్టు తెలిసింది. దీంతో ప్రసాద్ గాజువాక పోలీసులను ఆశ్రయించగా.నిందితురాలిపై ఐపీసీ 420, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో ఆమె గురించి మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆ యువతికి గతంలో జగదీశ్ అనే వ్యక్తికిచ్చి పెద్దలు పెళ్లి చేశారు. అయితే మూడురోజులకే ఆమె గర్భం దాల్చడంతో జగదీశ్ ఆమెను వదిలించుకున్నాడు. అంతకుముందు ఆమె శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలోనే వారిద్దరూ శారీరకంగా హద్దులు దాటడంతో గర్భం దాల్చింది. నీ కారణంగానే నన్ను భర్త వదిలేశాడు, నన్ను నువ్వే పెళ్లి చేసుకోవాలంటూ యువతి ప్రియుడిని ఒత్తిడి చేసింది. దీంతో శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటానంటూ కాలయాపన చేయడంతో ఆమెకు నెలలు నిండి పాపకు జన్మనిచ్చింది.అయితే శ్రీనివాస్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న ఆమె గట్టిగా నిలదీసింది. దీంతో శ్రీనివాస్ పాప బాధ్యత తాను తీసుకుంటానని, బ్యాంకులో కొంత మొత్తం డిపాజిట్ చేస్తానని నమ్మబలికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తనను మోసం చేసిన ప్రియుడిని ఆ యువతి వదల్లేదు. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న శ్రీనివాస్ ఓ ప్లాన్ వేశాడు. తన పిన్ని కొడుకైన ప్రసాద్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడని.. అతడిని లైన్‌లో పెట్టి పెళ్లి చేసుకుని హాయిగా ఉండమని సలహా ఇచ్చి అతడి ఫోటోలు, ఫోన్ నెంబర్ ప్రియురాలికి ఇచ్చాడు. ప్రియుడు చెప్పిన ప్లాన్‌ నచ్చడంతో ఆమె రంగంలోకి దిగి ప్రసాద్‌తో టచ్‌లోకి వెళ్లింది.ఆమె వలలో పడిన ప్రసాద్ పెళ్లి చేసుకుని భార్యను లక్నోకి తీసుకెళ్లాడు. అక్కడ రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు కొనిచ్చి ఆమెను బాగా చూసుకున్నాడు. కొద్ది నెలల తర్వాత తనకు కార్పోరేషన్లో ఉద్యోగం వచ్చిందని ప్రసాద్‌ని నమ్మించిన ఆమె తిరిగొచ్చేసింది.రెండో భర్త దగ్గర దోచుకున్న సొమ్ముతో ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయసాగింది. మరోవైపు ఆర్మీలో సెలవు దొరక్కపోవడంతో ప్రసాద్ చాలాకాలం పాటు వైజాగ్ రాలేకపోయాడు. ఇదే అదునుగా భావించిన ఆమె తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెబుతూ భర్త నుంచి పలు దఫాలుగా రూ.లక్షలు దోచుకుంది. చివరకు తన తల్లి చనిపోయిందని నమ్మించి మొత్తం రూ.45లక్షల వరకు లాగేసింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న సాయి అనే యువకుడు పరిచయం అయ్యాడు.అతడితో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించి మూడో పెళ్లి చేసుకుంది. చివరికి భార్య బాగోతం తెలుసుకున్న ప్రసాద్ వైజాగ్ చేరుకుని గాజువాక పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.....