సతీసహగమనాలు ఒకప్పుడు . నేడు నిజం

భువనేశ్వర్‌.... సతీసహగమనాలు ఒకప్పుడు జరిగేవి అని చెప్పుకుంటాం. తాజాగా ఒడిశాలో పతీసహగమనం జరిగింది. వివరాల్లోకి వెళితే.ఒడిశాలోని కలహండి జిల్లా గోలముండా సమితిలోని శైలుజోడి గ్రామంలో రాయబారి (60), నీలమణి శబర(65) భార్యాభర్తలు. రాయబారి గుండెపోటుతో మంగళవారం మరణించింది. నలుగురు కుమారులు, భర్త, గ్రామస్థులతో కలిసి గ్రామ శివర్లలోని శ్మశానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ చితిపేర్చి మృతదేహానికి నిప్పటించి అందరూ ఇళ్లకు బయలుదేరారు. అందరితోపాటే ఇంటికి బయలుదేరిన నీలమణి కొద్దిదూరం వచ్చి వెనక్కి తిరిగి పరుగున వెళ్లి చితిమంటల్లో దూకేశాడు. అందరూ చూస్తుండగానే ఒకే చితిలో భార్యాభర్తలు కాలిపోయారు. ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టారు.....