నేను ముస్లిం.గదిలో జీసస్..వెంకట సమీర్
abuztua 27, 2021
చిన్నతనం నుంచి తండ్రి ప్రేమకు దూరమైన నటుడు సమీర్. అనేక ఇబ్బందులు ఎదుర్కొని నటుడుగా నిలదొక్కుకున్నాడు. వైజాగ్ నుంచి 1600 రూపాయిలతో గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వచ్చి.ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయిలో నిలవగలిగాడు. టీవీ సీరియల్స్‌లో కెరియర్ మొదలుపెట్టిన సమీర్.ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ వందల చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు మంచి స్నేహితుడు అయ్యాడు. ఆ పరిచయాలతోనే బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించి క్రేజ్ దక్కించుకున్నారు. రీల్ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న సమీర్.రియల్ లైఫ్‌లోనూ అంతకు మించిన ఇబ్బందుల్ని చూశాడు.మూడునెలలకే తన తల్లిదండ్రులు తనని వదిలేసి వెళ్లిపోయిన విషయాన్ని గతంలోనే చెప్పిన సమీర్ తాజాగా తన మతం.పేరు మార్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను అన్ని భాషలు.అన్ని మతాలను గౌరవిస్తా. మా దేవుడి గదిలోకి వెళ్లి చూస్తే దర్గా ఉంటుంది.తిరుపతి వెంకన్నస్వామి ఉంటాడు.జీసస్ ఫొటో ఉంటుంది. నన్ను ఎవరైనా సమీర్ అంటే ముస్లిం కదా అని అడిగారంటే.నేను ఫస్ట్ ఇండియన్ అనే చెప్తా.ఆ తరువాతే ఇవన్నీ. అలాగని నేను ఈ మతాన్ని కించపరచడం లేదు.అన్ని మతాలను ఫాలో అవుతా.రంజాన్ మాసం వచ్చిందంటే నెల మొత్తం ఉండను కానీ.ఖచ్చితంగా ఒకరోజు చేస్తా. మా నాన్న ముస్లిం.తల్లి బ్రాహ్మిణ్.నేను చిన్నప్పటి నుంచి ఫాదర్‌తో పెరగలేదు కాబట్టి.ఆయన అలవాట్లు సాంప్రదాయాలు నాకు రాలేదు. మొత్తం అమ్మమ్మ ఇంట్లోనే పెరిగాను. నేను ఐదు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. 65 రోజులు దీక్ష చేశాను. నేను ఇలా ఉండటం చూసి చిరంజీవి గారు షాక్ అయిపోయారు. జై చిరంజీవా షూటింగ్‌లో అయితే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.ఏంటి సమీర్.నాకు అంతా కన్ఫ్యూజన్‌గా ఉంది.నీ పేరు సమీర్ నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావ్.అని అడిగారు. నేను ఇలాగే చెప్పా.వెంటనే ఆయన వావ్ సూపర్బ్ అని తెగ ఆనందపడ్డారు. నేను నా పేరుని నుంచి విన్నకోట వెంకట సమీర్‌గా ఛేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను సమీర్ హాసన్ కాదు. విన్నకోట వెంకట సమీర్.ఇంటిపేరు నేను ఎప్పుడూ వాడను కాబట్టి.ఇండస్ట్రీలో అందరికీ సమీర్‌గానే తెలుసు. అలాగే పిలుస్తుంటారు. అయితే ఇండస్ట్రీలో చాలామంది నాతో చెప్పింది ఏంటంటే.నువ్వు సమీర్ అని కాకుండా వేరే ఏదైనా హిందూ పేరు పెట్టుకుని ఉంటే వేరే రేంజ్‌లో ఉండేవాడివని అంటుంటారు. పౌరాణిక పాత్రలు కూడా చేశా.లక్ష్మణుడు, భరతుడు వంటి పాత్రలు చేసినప్పుడు నాన్ వెజ్‌కి దూరంగా ఉండమనేవారు. శ్రీరామరాజ్యం సినిమాకి అయితే బాలయ్యగారు కటిక నేలపై పడుకుని పూజలు చేసేవారు. ఆయన రెగ్యులర్‌గా డైలీ మూడు గంటలు పూజలు చేస్తారు. ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను ఆయన రేంజ్‌లో చేయలేదు కాదు.నా వరకూ నేను ఎంత చేయగలనో అంత చేశా’అంటూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నటుడు సమీర్. ఇదిలా ఉంటే సమీర్ తండ్రి ముస్లిం.. అతనికి ఆల్రెడీ పెళ్లైందనే విషయాన్ని చెప్పకుండా సమీర్ తల్లిని పెళ్లాడారు. సమీర్ పుట్టిన తరువాత కూడా ఆ విషయాన్ని చెప్పకుండా రహస్యంగానే ఉంచారు. సమీర్‌కి మూడు నెలల వయసు ఉండగా.అతన్ని వాళ్ల అమ్మమ్మ ఇంట్లో వదిలేసి తల్లిదండ్రులు షార్జా వెళ్లిపోవడం.ఆ తరువాత భోపాల్ షిఫ్ట్ కావడం.అక్కడే సమీర్‌కి చెల్లి పుట్టడం.ఆమెను కూడా తీసుకుని వచ్చి అమ్మ మ్మ ఇంట్లో వదిలేసి తిరిగి షార్జా వెళ్లిపోవడం.పిల్లల్ని తన దగ్గరకు తెచ్చుకోవడం కోసం సమీర్ తల్లి భర్తతో ఫైట్ చేయడం. ఇలా సమీర్ లైఫ్‌లో చాలా ఒడుదుడుకులు ఉన్నాయి....