పంచాయతీ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది తో సమావేశం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్
abuztua 31, 2021
TV77తెలుగు
రాజమండ్రి రూరల్...
కొలమూరు, పంచాయతీ కొంతమూరు గ్రామంలో పంచాయతీ ఆఫీస్ వద్ద పంచాయతీ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది తో సమావేశం అయ్యిన రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్.కొలమూరు పంచాయతీ కొంతమూరు గ్రామంలో పంచాయతీ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక నాయకులు కొలమూరు పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలను చందన నాగేశ్వర్ దృష్టి కి తీసుకువొచ్చారు.ముఖ్యంగా శానిటేషన్ డ్రైనేజీ మరియు రోడ్లు సమస్యల మరియు పందుల బెడద గురుంచి నాగేశ్వర్ కి తెలుయజేశారు.కొలమూరు పంచాయతీ లో సమస్యలు ఉన్నా ప్రాంతాల్లో పర్యటన చేస్తాము అని, డ్రైన్లు మరియు రోడ్ల మీద చెత్తను వేయకుండా, ఇంటి ఇంటికి తడి చెత్త పొడి చెత్త విడిగా ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, డ్రైనేజీ లు ఎప్పటికప్పుడు సిల్టు ను తొలగించాలని పంచాయతీ సిబ్బందికి తెలిపారు. ఈ వర్షాకాలంలో డెంగ్యూ మరియు మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రభ జల్లే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా మన అందరం కలిసి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే వాటిని నిరోధించవచ్చని స్థానికులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ హనుమంతరావు, సచివాలయ సిబ్బంది మరియు కొంతమూరు వై.ఎస్.ఆర్.సి పి నాయకులు తదితరులు పాల్గొన్నారు......