స్టేషన్‌లో నిందితుడు ఆత్మహత్యాయత్నం
abuztua 27, 2021
పశ్చిమగోదావరి జిల్లా...
భీమవరం సెబ్ కార్యాలయంలో నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పట్టణానికి చెందిన చింతాడ శ్రీను ఇటీవల మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెబ్ సిబ్బంది ఒకరు కేసు లేకుం డా చేస్తామని రూ.12,500 నగదు, కేజిన్నర వేట మాంసం తీసుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. గురువారం శ్రీను భార్యను స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలిసి శ్రీను సెబ్ కార్యాలయాని కి వెళ్లాడు. తనపై కేసు నమోదు చేయడంతో చీమలమందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. సెబ్ అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించారు. సెబ్ సీఐ వర్మ మాట్లాడుతూ శ్రీను పాత కేసులో నిందితుడని, ఎన్నిసార్లు వెళ్ళినా దొరకకపోవడంతో అతడి భార్యను స్టేషన్‌కు రప్పించామన్నారు. పథకం ప్రకారం శ్రీను స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు తెలిపారు. శ్రీను అభియోగాలపై విచారణ చేపట్టాలని సెబ్ ఏఎస్పీ జయ రామరాజును ఆదేశించినట్టు ఎస్పీ శర్మ తెలిపారు. విచారణలో సిబ్బంది అవినీతికి పాల్పడినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడితే స మాచారాన్ని 95503 51100 నెంబర్‌కు వాట్సప్ చేయాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతా మన్నారు....