మలబార్‌ గోల్డ్‌ షోరూమ్‌ మంచిర్యాలలో

హైదరాబాద్‌... బంగారు, వజ్రాభరణాల రిటైల్‌ దిగ్గజం ‘మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌’ తెలంగాణలోని మంచిర్యాల పట్టణంలో తన షోరూమ్‌ ప్రారంభించింది. కంపెనీకి తెలంగాణలో ఇది 15వ షోరూమ్‌. మంచిర్యాల శాసనసభ్యులు ఎన్‌ దివాకర్‌ రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పీ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముకేశ్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ సతీష్‌ ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌, కో చైర్మన్‌ పీఎ ఇబ్రహీం హాజీ వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. స్థానిక గంగారెడ్డి రోడ్‌లోని మార్కెట్‌ ప్రాంతం లో ఉన్న కేపీఆర్‌ ప్లాజాలో 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షోరూమ్‌ ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్‌లో అన్ని రకాల బంగారు, వజ్రాభరణాలు అందుబాటులో ఉంటాయని మలబార్‌ గోల్డ్‌ తెలిపింది. కాగా మంచిర్యాల షోరూమ్‌ ద్వారా వచ్చిన లాభాల్లో 5 శాతం మొత్తాన్ని ఈ ప్రాంతంలోని వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు తెలిపింది....