రేపు షర్మిల దీక్ష
abuztua 30, 2021
*TV77తెలుగు*
తెలంగాణ...
నిరుద్యోగ సమస్యలపై పోరాడుతోంది వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. అందులో భాగంగానే ప్రతి మంగళవారం షర్మిల నిరాహార దీక్ష చేపడుతోంది. అయితే రేపు మంగళవారం చేపట్టబోయే స్పెషల్ గా ఉండబోతోంది. సీఎం కేసీఆర్ గెలిచిన గజ్వెల్ నియోజకవర్గంలో షర్మిల దీక్షకు దిగనున్నారు. గజ్వేల్ మండలం అనంతరావుపల్లిలో ఉద్యోగం రాలేదనే బాధతో కొప్పు రాజు అనే యువకుడు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కుటుంబాన్ని షర్మిల రేపు ఉదయం పరామర్శించనున్నారు. అనంతరం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజ్ఞాపూర్ లో నిరుద్యోగదీక్షలో పాల్గొంటారు....