తమన్నా సాహసంను అభినందించాల్సిందే
abuztua 05, 2021
హీరోయిన్ గా ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు తక్కువేం లేవు. అలాగే ఈమె ఐటెం సాంగ్స్ ను కూడా చేసేందుకు సిద్దంగా ఉంది. ఇంతగా బిజీగా ఉన్న ఈ అమ్మడు వరుసగా వెబ్ సిరీస్ లు కూడా చేసేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈమె రెండు వెబ్ సిరీస్ లు చేసింది. అందులో ఒకటి తెలుగు లో కాగా ఒకటి తమిళంలో.. రెండు వెబ్ సిరీస్ లు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఆ రెండు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిగా తమన్నా ది బెస్ట్ ఇచ్చింది అంటూ ప్రశంసలు దక్కించుకుంది. అద్బుతమైన నటనతో తమన్నా ఆ వెబ్ సిరీస్ ల స్థాయిని పెంచేసింది. ఇప్పటి వరకు తమన్నా చేసిన సినిమాలు కేవలం లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లు మాత్రమే. కాని తాజాగా ఈమె కమిట్ అయిన వెబ్ సిరీస్ మాత్రం హిందీలో రూపొందబోతుంది.
తెలుగు మరియు తమిళంలో రూపొందిన వెబ్ సిరీస్ ల మాదిరిగా కాకుండా అన్ని విషయాల్లో కూడా తమన్నా తన ప్రతిభను పూర్తిగా బయట పెట్టాల్సిన వెబ్ సిరీస్ గా చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ ను బాలీవుడ్ లోనే దిగ్గజ నిర్మాత అయిన దినేశ్ విజయన్ నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ప్రముఖ ఓటీటీ ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికే ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ లు పలువురు ఈ వెబ్ సిరీస్ లో భాగస్వామ్యం అవుతారని అంటున్నారు. ఈమద్య కాలంలో వెబ్ సిరీస్ లు ఉత్తరాదిన ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా వెబ్ సిరీస్ లు బిజినెస్ చేయడంతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఉంటున్న కారణంగా వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు మరియు నటించేందుకు సిద్దంగా ఉంటున్నారు.